ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్ర బాబు రాష్ట్ర అభివృద్ధిలో మరియు నిఘా వ్యవస్థలో విఫలమయ్యారు అని అన్నారు.
అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను, కాల్చి చంపడము చంద్ర బాబు చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు.
పోలీస్ వ్యవస్థను చంద్ర బాబు నిర్వీర్యం చేశారు. పోలీసులు ప్రజల కంటే పచ్చ కార్యకర్తలకు, పచ్చ నాయకులకు రక్షణ కల్పిస్తూ ప్రజారక్షణ మరిచారని విమర్శించారు.
రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన 2500 కోట్లు వినియోగించి ఇంత వరకు పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు చేపట్టలేదు అని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం లో మహిళలకు, మహిళల అధికారులకు రక్షణ కరువైంది. మంత్రులు, మంత్రుల కొడుకులు మహిళలను, మహిళల అధికారులను వేధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
బాబు, లోకేష్ అవినీతిలో కూరుకుపోయారు అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రాష్ట్రాన్ని దోచుకోవడం లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.
పెట్రోలు, డీజిల్ పైన వసూలు చేసి రాజధాని నిర్మాణం కోసం విధించిన పన్ను సుమారు 14000 వేల కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశారో ప్రజలకు తెలపాలని కోరారు.
చంద్ర బాబు ఒక మానసిక రోగి తను ఏమీ మాట్లాడుతున్నడో తనకే అర్థంకాని పరిస్థితి అన్నారు.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు, శాసనమండలి సభ్యులు శ్రీ మాధవ్ గారు, యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రమేష్ నాయుడు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ నాగభూషణం గారు, తదితర నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.