ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక దుర్మార్గుడు, అబద్ధాల కోర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని ఖర్చు చేసి ఇప్పుడు ఏమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని ” U” టర్న్ తీసుకోవడం ఆయన 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం అమరావతి లోని మంగళగిరి లో మరియు విశాఖపట్నం లోని భోగాపురం విమానాశ్రయం నిర్మించడానికి సిద్దంగా ఉన్న దానికి సహకరించడనికి చంద్రబాబు సుముఖత చూపడం లేదు అని విమర్శించారు.
ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా అద్యక్షుడు శ్రీ కోటగిరి నారాయణ రావు గారు ,రాష్ట్ర నాయకులు శ్రీ పూడి తిరుపతి రావు గారు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.