ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ శక్తి కేంద్రల ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అనైతికంగా,అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వార్ధ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారని రుజువు చేశారు.

కేంద్ర నిధులు తీసుకుంటూనే U-టర్న్ తీసుకోవడానికి సిగ్గు పడరని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే అవకాశవాది అని తీవ్రంగా విమర్శించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ రవీంద్ర రాజు గారు, జిల్లా ఇంచార్జీ శ్రీ హరినాథరెడ్డి గారు, నియోజకవర్గ కన్వీనర్ శ్రీ మూరహరీ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సుబ్బా రెడ్డి గారు, నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.