ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కడప, రాజంపేట, పార్లమెంటు నియోజకవర్గల సమీక్షా సమావేశం కడప లో నిర్వహించారు

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడి పని చేయాలని అన్నారు.

సీనియర్ నాయకులు మరియు కొత్త నాయకులు కలుపుగోలు గా వెళ్లి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సీనియర్ నాయకులు పార్టీ లో కి కొత్త వారికి ఆహ్వానంచాలి అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతి మండలంలో వెళ్లి పూర్తి స్థాయిలో కమిటీలు వేయాలి అన్నారు.

మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరియు విజయాలు ప్రజలకు చేరువ కావడానికి “ఇంటింటికీ బిజెపి” కార్యక్రమం చేపట్టాలి అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యురాలు శ్రీమతి శాంత రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కందుల రామమోహన రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్, సుంకర శ్రీనివాస్ గారు, శ్రీ అడపా నాగేంద్ర గారు, శ్రీ శేషి భూషణ్ రెడ్డి గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ సన్యాసి రాజు గారు, మరియు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.