బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు.

బిజెవైఎం రాష్ట్రా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ నాయుడు గారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ గారు పాల్గొన్నారు,
గతంలో యువ మోర్చాలో పని చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులను ఆత్మీయంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ..

నాలుగు సంవత్సరాల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయం అని కొనియాడారు.

తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీగా మారి డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు.

రాష్ట్ర విభజన తరువాత ఎపికి మేలు జరిగేలా ఒక్క బిజెపి తప్ప వేరే ఏపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేయలేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యాభివృద్ధికి 4 సంవత్సరాలలోనే 10 కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని తెలిపారు.

టిడిపి వారు చెప్తున్నట్టుగా తిరుపతి సాక్షిగా నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తామనది సరి కాదని, నెల్లూరు సమావేశం ప్రత్యేక హోదా వస్తే ఏవిధమైన ప్రయోజనాలు వస్తాయో వాటిని ఇస్తామని చెప్పారని, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని అన్నారు.

అధికార టిడిపి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అవినీతి మయం చేసిందని ఆ పార్టీకి ఒక సిద్దాంతం లేదని విమర్శించారు.

ఈ డ్రామా పార్టీ ఆంద్రప్రదేశ్ కు అవసరం లేదని, 2019 లో ఈ అవినీతి డ్రామా పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

రమేష్ నాయుడి గారి నేతృత్వంలో యువమోర్చా బలోపేతం అయ్యి తద్వారా పార్టీ పటిష్టం కావాలని ఆకాంక్షించారు.ఆయనకు అభినందనలుతెలియజేశారు.

వివిధ జిల్లాల యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన రమేష్ నాయుడు గారిని సన్మానించారు..