ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అనంతపురం , హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పధాదికారుల సమావేశం ధర్మవరం లో నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని తెలిపారు.దేశాభివృద్ధి మోదీ గారి తోనే సాధ్యం అన్నారు. మోదీ గారు ప్రధాని కాదు, ప్రధాన సేవకుడుగా కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన దేశవృద్ధి రేటు పెరిగింది అన్నారు.చంద్రబాబు వల్ల గోదావరి పుష్కరాలలో ఎంతో మంది అమాయకులు చనిపోయారు కానీ ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసికొలేదని విమర్శించారు.టిడిపి అంటే తెలుగు దొంగల పార్టీ అని చంద్ర బాబు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, సహచర మంత్రులు అవినీతిలో కూరుకపోయారు వీరి పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్ర బాబు భారతీయ జనతా పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తల పై అక్రమ అరెస్టులు, కేసులు పెట్టడం సరికాదన్నారు.అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో బూత్ మరియు శక్తి కేంద్రాల కమిటీలు వేయాలని తెలిపారు.సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్దన్ రెడ్డి గారు , శ్రీ కపిలేశ్వరయ్య గారు , రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు,శ్రీ కునిగిరి నీలకంఠ గారు , రాష్ట్ర నాయకులు, శ్రీ పార్థసారథి గారు , శ్రీ కోట్ల హరీ చక్రపాణి రెడ్డి గారు, తదితర నాయకులు, పాల్గొన్నారు.