భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు బారతీయ మహిళామోర్చా కార్యవర్గ సమావేశాలను పూరీ జగనాధ్ ఒరిస్సా రాష్ట్రంలొ ప్రారంభించారు.

ఈ సమావేశంలో అమిత్ షా గారు మాట్లాడుతూ దేశంనుండి రాష్ట్రాలనుండి వచ్ఛిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రక్షణ కు, మహిళ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తోట విజయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లొ మహిళల రక్షణ అనే అంశాలపై ముందుకు తీసుకువెళుతున్నమని తెలిపారు .

కేంద్రప్రభుత్వం మహిళల రక్షణ కోసం నడుపుతున్న మహిళల సహాయార్థం 24 గంటలు నడిచే 181 టొల్ ఫ్రీ హెల్పులైన్ నంబరు ,సఖీ (one stop centr ) మరియు స్వాధార్ గృహాల గురించి విసృత ప్రచారం చేసే ప్రయత్నం లొ ఆంధ్రప్రదేశ్ భారతీయ మహిళా మోర్చా కంకణం కట్టుకుంది అని సూచించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి తొట విజయలక్ష్మి రూపొందించిన ఒక గోడ పత్రికను జాతీయ సమావేశంలో శ్రీ అమిత్ షా గారు , జాతీయ మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీమతి విజయ రాహత్కర్ గారు మరియు జాతీయ మహిళా మోర్చా ఇంచార్జి శ్రీమతి పురంధరేశ్వరి గారు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది .

ఈ కార్యక్రమములో జాతీయ మహిళామోర్చా కార్యదర్శి శ్రీమతి శరణాల మాలతీరాణీ గారు, మాజీ కార్యదర్శి నిర్మలా కిషొర్ , బొల్లాప్రగడ శ్రీదేవి పాల్గొన్నారు.