రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

11వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు:

🔶ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టును ధారాదత్తం చేసి, ముడుపులు కమీషన్ల కొరకు భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లు రద్దు చేసిన కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్దమా ??

🔶బీద రాష్ట్రమని, కట్టుబట్టలతో బయటికి వచ్చామని కధలు చెపుతూ, ప్రజాధనాన్ని మీ ఆర్భాటాలకు దుర్వినియోగం చేయడం లేదా ?? ఇంత దుర్మార్గపు దుబారా ఎక్కడ అయినా ఉందా ?? ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీలకు ఈ 4 ఏళ్లలో ఎంత చెల్లించారో వెల్లడించగలరా ??

🔶దేశంలో ఎక్కడా లేనంతగా భారీ సొమ్ములు వెచ్చించి అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తే చిన్నపాటి వర్షానికే లీకులతో నీళ్ళు వస్తున్నాయి. ఇంత అవమానకర విషయం పై మీకు సిగ్గుగా లేదా ?? రాష్ట్ర పరువు నాశనం కాలేదా ??

🔶మీ పాలనలో మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక దాడులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ?? స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తానని కామాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారా ??

🔶రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ఏర్పరచబడ్డ ఎంతో కీలకమైన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీకి భారత పౌరసత్వం లేని వ్యక్తిని సి.ఈ.ఓ గా నియమించవచ్చా ??

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??