దళితుల పై దాడులు చేయడమే దళిత తేజమా?

రాష్ట్రంలో దళిత తేజం తెలుగుదేశం అని గొప్ప కార్యక్రమం చేశారు. కానీ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు వ్యాఖ్యానించలేదా చంద్రబాబు ??

ప్రభుత్వంలో భాగమైన వర్ల రామయ్య, మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరుస్తూ మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉన్నారనేది నిజం కాదా చంద్ర బాబు??

2017 లో పశ్చిమగోదావరి జిల్లా గరుగపర్రులో దళితులను బహిష్కరించలేదా… ??

2017 డిసెంబర్ లో విశాఖపట్నంలో దళిత మహిళను వివస్త్రను చేసి టిడిపి నేతలు కొట్టడం నిజం కాదా…?

2018 జనవరిలో కర్నూల్ జిల్లా నక్కలదిన్నెలో పారిశుధ్య పనులు చేయలేదని దళిత మహిళను వెలివేయడం నిజం కాదా??

అదే నెలలో గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితుల పై టిడిపి నేతలు దాడులు చేయడం వాస్తవం కాదా??

మీ హయంలో దళితలపై దాడులు పెరగడం నిజం కాదా..
ఇదేనా దళితులకు మీరిచ్చే గౌరవం.