బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శ్రీ. తోట విజయలక్ష్మి గారు నేడు భాద్యతలు స్వీకరించారు.

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా శ్రీ. తోట విజయలక్ష్మి గారు నేడు భాద్యతలు స్వీకరించారు.

మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, మహిళా సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

చిన్నారి బాలబాలికలను ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మిషన్ “ఇంద్రధనస్సు”,ఆడపిల్లల బంగారు భవిష్యత్ కు ఆర్థిక భరోసా కోసం “సుకన్య సమృద్ధి యోజన”, పేద మహిళలను ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోసం “ఉజ్వల”, అసంఘటిత మహిళల వ్యాపారాల తోడ్పాటుకు “ముద్రా యోజన”, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటం కోసం “స్టార్టప్ ఇండియా – స్టాండప్ ఇండియా”, వంటి ఎన్నో పధకాలను మోదీ గారు విజయవంతంగా అమలు చేస్తున్నారు.

నయా రోశ్నీ ద్వారా మైనారిటీ మహిళలకు విద్యా, ఆరోగ్యం,నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అనేక అంశాలలో అండగా నిలబడ్డారు.

ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా మైనారిటీ మహిళలకు పూర్తి మద్దతు తెలిపి సాంఘిక, మత దురాచారాల బారిన పడకుండా వారికి రక్షణ కల్పించారు.

స్వతంత్ర భారత చరిత్ర లో మహిళా పక్షాన నిలచిన ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు, మహిళా లోకం మోదీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, చేపట్టిన సంస్కరణలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతీ గ్రామంలో, పట్టణంలో ప్రచారం కల్పించడానికి మహిళా మోర్చా విశేష కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం గారు, జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ పురంధేశ్వరి గారు, మహిళా మోర్చా మాజీ అధ్యక్షులు మాలతీ రాణి గారు, అధికార ప్రతినిధి గాయత్రి గారు, తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.