ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ …

ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ….

రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల ద్వారా బిజెపి 2019 ఎన్నికలకు శంఖారావం పూరించిందని అన్నారు.

ఏపీ లో గత రెండు ఏళ్లుగా వస్తున్న పుకార్లు నిజమయ్యాయి. చంద్రబాబు రాహుల్ గాంధీతో అక్రమ సంబంధం పెట్టుకుంటారని మేము ముందే చెప్పామని గుర్తుచేశారు.

2014 జులై నుంచి బీజేపీ పై దృష్ప్రచారం చేశారు.మోడీ ఇమేజ్ ఎలా దెబ్బతీయలని చూశారు అని ఆరోపించారు.

ఓబీసీ బిల్లు,త్రిపుల్ తలక్ బిల్లు సమయంలో టీడీపీ బిల్లుకు వ్యతిరకంగా వున్నరని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ ని ఎన్టీఆర్ స్థాపించారు, కానీ టిడిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్.టి.ఆర్ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు.

నిజమైన టీడీపీ నాయకులు దీనిని ప్రశ్నించాలని తెలిపారు.

చంద్రబాబులో నేను ఒక అపరిచితుడిని చూస్తున్నాను, నిన్న ఏం మాట్లాడారో ఈరోజు ఆయనకు గుర్తు ఉండడం లేదు. మంత్రులు కూడా చంద్రబాబు బాటలో అపరిచితులు అవుతున్నారని ఎద్దేవచేశారు.

రంగులు మార్చే ఊసరవెల్లి కూడా చంద్రబాబు ను చూసి సిగ్గుపడుతుందని విమర్శించారు.

మోడీ,బీజేపీ పై రాష్ట్రములో విషప్రచారం చేస్తున్నారు.గతంలో చంద్రబాబు మోడీ మన రాష్టానికి అధికంగా నిధులు ఇచ్చారు అని చెప్పారు.

అవకాశం వాది చంద్రబాబు పాలన ఏపీ ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు.

టీడీపీ డ్రామా కంపెని,పార్టీకి సిద్ధాంత అంటూ లేదు అని విమర్శించారు.

రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది. కేంద్రమంత్రులు అభివృద్ధి పనులు చేయడానికి వస్తే టిడిపి నాయకులు రాష్ట్ర మంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

2019 ఎన్నికలలో ఏపీ ప్రజలు ఈ డ్రామాలను తిప్పికొడతారని అన్నారు.

రాష్ట్ర బీజేపీ మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 20వ తేదీన కాకినాడలో జరుగుతుందని తెలియచేసారు.

“ఇంటింటికి బీజేపీ” అనే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడతాం. అన్నారు.

ప్రపంచంలో చంద్రబాబు నాయుడు కన్నా అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.

ఆపరేషన్ గరుడ అని ఒక సినీనటుడు ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరొక కొత్త నాటకం తో మరోసారి ప్రజల ముందుకు వచ్చాడు అని విమర్శించారు.