రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

10వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు:

🔶మీ పార్టీ ఎం.ఎల్.ఏ ల, ఎం.పి ల, ఎం.ఎల్.సి ల అవినీతి అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా ?? సి.బి.ఐ. విచారణకు సిద్ధమా ??

🔶ఈ నాలుగు సంవత్సరాలలో మీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబంధించిన వ్యాపారాలు ఎన్ని ఇతర రాష్ట్రంలో పెట్టారు ? ఎన్ని మన రాష్ట్రంలో పెట్టారు ?? నిజాయితీగా ప్రజలకు చెప్పగలరా ??

🔶బిజెపి మీద కోపంతో బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చాలని ప్రయత్నించడం లేదా ?? తద్వారా కోట్లాది మంది ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూడడం లేదా ?? మీ స్వార్ధం కోసం ఇంత ద్రోహం చేయవచ్చా ??

🔶వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పుకునే మీరు వెనుకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలోకి తొక్కలేదా ?

🔶ఎంతో వెనుకబడిన ప్రకాశం, కడప జిల్లాలకు వరప్రసాదం అయిన వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకీ పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం కాదా మీది ??

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??