రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని, అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతీ వారము 5 ప్రశ్నలు సంధిస్తున్నారు.

9వ వారం ముఖ్యమంత్రి గారికి కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ప్రశ్నలు:

🔶పేద కాపు యువతకు ఇచ్చే కోచింగ్ సెంటర్ల నుండి కూడా ముడుపులు వసూలు చేసిన ఘనత మీ ప్రభుత్వానిదే, ఇంత నిస్సిగ్గు పాలన అందిస్తున్న మీ ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఉందా ??

🔶గోదావరి,కృష్ణా పుష్కరాల పనులు, ఫైబర్ గ్రిడ్ సెట్ అప్ బాక్సులు, పట్టిసీమ పనులు, చంద్రన్న బహుమతుల కొనుగోళ్ళలో జరిగిన కుంభకోణాలపై సిబిఐ విచారణకు సిద్ధమా ??

🔶మీ పర్యటనల సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు ?? ఈ నియత్రుత్వ రాక్షస పాలనా సంస్కృతికి తెరతీస్తున్నది మీరు కాదా ?? ప్రజాస్వామ్య భారతానికి సంజాయిషీ ఇవ్వాల్సిన భాద్యత మీకు లేదా ??

🔶ఉత్తర భారతం – దక్షిణ భారతం అనే మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా దేశ సమగ్రతను, దేశ సార్యభౌమత్వాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నది మీరు కాదా ??

🔶మీ ఎలక్షన్ మానిఫెస్టోలో ప్రతీ జిల్లాకు, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రాన్ని తయారుచేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 1500 రోజుల్లో ఎన్ని తయారుచేసారో, ఎన్ని అమలు చేసారో ప్రజలకు చెప్పగలరా ?? ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలరా ??

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??