ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నూతన అధ్యక్షుడు గా శ్రీ సూర్యనారాయణరాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు.
నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అందజేశారు.
సూర్యనారాయణ రాజు గారు మాట్లాడుతూ రైతు సమస్యలపై ప్రతీ జిల్లా లో పర్యటించి రైతులకు సంబంధించిన కేంద్ర పథకాల ను సభలు పెట్టి రైతులకు వివరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కో ఇన్-ఛార్జ్ సునీల్ ధియోధర్ గారు,పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగ రాజు గారు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధేశ్వరి గారు, మాజీ ఎంపి కావూరి శ్రీ సాంబశివరావు గారు, శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, మాజీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పూడి తిరుపతి రావు గారు తదితర నాయకులు పాల్గొన్నారు.