ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం మండల ఆఫీసు బేరర్ల సమావేశం నేడు నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సహ ఇంచార్జీ శ్రీ సునీల్ దియోధర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అవినీతి లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు తెలిపారు.

ఈ అవినీతి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యాపించిందని అన్నారు. అలాగే ఆయన అబద్ధపు ప్రచారలతో ప్రజలు విసిగి పోయారు.2019 ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ రవీంద్ర రాజు గారు, కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణరాజు గారు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి రేవతి గారు, శ్రీ కునిగిరి నీలకంఠం గారు, తదితరులు మరియు కార్యకర్తలు పెద్ధ ఎత్తున పాల్గొన్నారు.