నేడుబీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతోంది.

నేడుబీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం విజయవాడలో జరుగుతోంది.

రాజ్యసభ సభ్యుడు, కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేరళలో బిజెపిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన వి.మురళీధరన్ గారు ఇన్-ఛార్జ్ గా మరియు త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముఖ్య వ్యూహకర్త సునీల్ ధియోధర్ గారు కో-ఇన్-చార్జ్ గా నేడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మరియు బీజేపీ జాతీయ సహా సంఘటన కార్యదర్శి శ్రీ. సతీష్ జి గారు,మహిళా మోర్చా జాతీయ ఇంచార్జ్ పురందేశ్వరి గారు, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల పైనా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా మరియు బి.జె.పి పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారు.

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపట్టిన చర్యలను మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.

నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున ఏవిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి, బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు.