రాజధాని భూ కుంభకోణం పై సిబిఐ విచారణకు సిద్ధమా?

మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకొని 1691 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ పద్దతిలో కట్టబెట్టలేదా??

సేకరించి ఏళ్లు గడుస్తున్నా వారికి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరిచిన భూములను ఇవ్వకుండా మోసం చేస్తుంది మీరు కాదా??

అప్పుడెప్పుడో చక్రవర్తులు దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకీ ధారాదత్తం చేసినట్లు ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని సింగపూర్ కు దోచిపెట్టడం లేదా చంద్రబాబు??

33 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ కి మిమ్మల్ని నమ్మి ఇచ్చారు రైతులు అని చెప్పారు..
కానీ, అలా నమ్మి ఇచ్చిన రైతులను నిండా ముంచింది మీరు కాదా??