బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు

భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చంద్రబాబు అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు విజయవాడ నందు కార్యకర్తలు విశేషంగా పాల్గొని ధర్నా చేశారు.

బాబు జాబ్ ఏది?, వడ్డీలేని రుణాలు ఎక్కడ?, డీఎస్సీ ఎప్పుడు?, జిల్లాకో స్పోర్ట్స్ కాలేజీ ఏది ?అంటూ నినదించారు.

ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీ పి వి ఎన్ మాధవ్ ఎమ్మెల్సీ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జమ్మల కిషోర్ గారు పాల్గొన్నారు.

మాధవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు తన బాబు లోకేష్ బాబు కి మాత్రమే జాబు ఇచ్చాడని, రాష్ట్రంలోని ఏ బాబు కు జాబు ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 2000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వడ్డీలేని రుణాలు ఎవరికిచ్చారో తెలపాలన్నారు. చంద్రబాబు కేంద్ర నిధులతో నడిచే కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడం తప్ప మరేమీ చేయట్లేదు అన్నారు.

గత ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన యువత 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీనివాస రాజు గారు, శ్రీ చిక్కాల రజనీకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు