ప్రత్యేక హోదా – వాస్తవాలు – అసత్యాలు

నిజం నిద్రలేచి నడక మొదలెట్టినప్పటికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అని సామెత.

ప్రత్యేక హోదా అంశంలో ఈ విషయం అక్షర సత్యం. పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన ఒక విధంగా ఉంటే ప్రత్యేక హోదాపై ప్రచారం మరొక రకంగా ప్రజల్లోకి వెళ్లి పోయింది.

ఈ అంశాన్ని వాస్తవాలతో విశదీకరిస్తూ నిన్న గుంటూరులో బిజెపి మీడియా ప్రతినిధుల సమావేశంలో yvKrishna ప్రసంగం

పార్లమెంట్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన ప్రత్యేక హోదా పై ఈ విధంగా ఉంది:

దీని అర్ధం చాల విపులంగా సరళంగా ఉంది. కేంద్ర ప్రభుత్వo ఆర్ధిక సహాయం కోసంగా ప్రత్యక హోదాను రాష్ట్ర ఆర్ధిక స్థిరత్వానికి 5 సంవత్సరాలు ఇవ్వడానికి అంగీకరించారు.

ఇక్కడ పరిశ్రమ రాయితీల ప్రస్తావన ఎక్కడ లేదు. కనుక ఈశాన్య రాష్ట్రాల పరిశ్రమ రాయితీల సదుపాయాలను మన్మోహన్ సింగ్ గారు వాగ్దానం చేసారు అనడం వాస్తవం కాదు.

పరిశ్రమ రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లో భాగం గా రావటంలేదు. మరియొక పరిశ్రమలకు సంభoదించిన సర్కులర్ ద్వారా ప్రత్యేకం గా కలిపించారు.

ఇక పరిశ్రేమ రాయితీల గురుంచి మన్మోహన్ సింగ్ గారి వాగ్దానం ఈ క్రింది విధంగా ఉంది.

ఈ పారాలో రెండు రాష్ట్రాలకు పారిశ్రామిక అభివృధికి పరిశ్రమ రాయితీలు ఇవ్వడానికి వాగ్దానం చేసారు. విభజన చట్టంలో చెప్పిన విధంగా ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా రెండు రాష్ట్రాలకు ఇవ్వటానికి ఒప్పుకున్నారు.

అంటే ఈ రాయితీలు కేవలం ఆంధ్ర ప్రదేశ మాత్రమే రావు. తెలంగాణకు వస్తాయి. అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు సమానంగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారని ఉహించుకొని రాలేదు అనుకోవటం మన్మోహన్ సింగ్ గారి ప్రకటనను సరిగా అర్ధం చేసుకోకపోవటమే.

రాహుల్ గాంధీ గారు గూడా మన్మోహన్ సింగ్ గారి ప్రకటనకు అనుగుణంగా ప్రత్యేక హోదా ఇస్తాం అనడం గమనిoచ వలసిన విషయం. అది ఎటుతిరిగి ప్రత్యేక పాకేజీలో భాగం. ఆయన అదనంగా ప్రకటించిందేమీలేదు.

ఇక పద్నాల్గవ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా , ప్రస్తుత పరిస్థితి , మరియు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు గురించి ప్రసంగం వివరాలు వేరొక post లో !