కులాల రిజర్వేషన్ల పేరుతో అమాయకులను మోసం చేయలేదా?

చాలా కులాలకు క్రొత్త గా రిజర్వేషన్లు, ఉన్న రిజర్వేషన్లు ఒక కేటగిరి నుండి మరో కేటగిరికి మారుస్తామని హామీలిచ్చి, కోట్లాదిమంది అమాయకులను మోసం చేయలేదా చంద్ర బాబు?

రజకులను, అరె కటిక, గాండ్ల, షెడ్యూల్డ్ కులాలోనికి, ఉప్పర మరియు పూసల కులాల వారిని బిసి( డి) నుండి బిసి (ఎ) కు, కురుమ కురుబ కులాల వారిని ఎస్టీ లుగా, గవర కులం వారిని బిసి (డి) నుండి బిసి (ఎ) కు, కళింగ కోమట్ల లను బిసిలుగా, వాల్మీకి బోయలను ఎస్టీలు గా, పద్మ శాలీలను బిసి (బి) నుండి బిసి (ఎ) కు, నాగవంశం వారిని బిసి ( డి) నుండి బిసి (ఎ) కు, మజ్జ లను బిసి (డి), కాపులను బిసిల జాబితాలోకి మారుస్తామని హామీ ఇచ్చి మోసం చేయలేదా చంద్ర బాబు??