1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

పోలవరం పునరావాస వ్యవస్థ నిధుల చెల్లింపులలో పారదర్శకత లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన 1400 కోట్ల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.R&R ప్యాకేజీ భూసేకరణ మరియు పోలవరం నిర్వాసితుల పునరావసానికి ఖర్చు చేసిన1407.64 కోట్ల రూపాయల నిధులకు లెక్కలు చూపలేదు.ఆడిట్ వివరాలను పరిశీలించగా సంస్థకు నిధుల చెల్లింపులు మరియు భూసేకరణకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు.ముఖ్యంగా వర్గీకరణ, చెల్లింపులు మరియు భూసేకరణ వివరాలను నిర్వహించడానికి ప్రత్యేకమైన పారదర్శకత కలిగిన వ్యవస్థ లేదు.జాతీయ ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం నిధుల చెల్లింపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం మధ్య అవగాహన పత్రంపై సంతకం కలిగి ఉండాలి.కానీ ఆడిట్ వివరాలను పరిశీలించగా జాతీయ ప్రాజెక్ట్ ను ప్రారంభించి మూడు సంవత్సరాల కాలం దాటి పోయినప్పటికీ ఎలాంటి అవగాహన మరియు ఒప్పంద పత్రం(MOU) ఇరు పార్టీల వారు కలిగిలేరని స్పష్టంగా అర్థం అవుతుంది.