బిజెపి పై ఉన్న బలమైన నమ్మకంతో, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్న ప్రియమైన నాయకులకు మరియు బిజెపి సైనికులకు …

బిజెపి పై ఉన్న బలమైన నమ్మకంతో, పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్న ప్రియమైన నాయకులకు మరియు బిజెపి సైనికులకు …

బిజెపి ఆంధ్ర ప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేయడం నిజంగా నాకు ఒక గౌరవం. బిజెపి ఆంధ్రప్రదేశ్ లోని కార్యకర్తలు అందరి నుంచి నేను మద్దతును, ప్రేమను అందుకోవడం నా అదృష్టం. మీ జీవితంలోనూ మరియు మీ రాజకీయ జీవితంలోనూ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పార్టీని ఎవ్వరూ ఊహించని గొప్పస్థాయికి తీసుకువెళ్ళాల్సిన పెద్ద బాధ్యత నాపై ఉంది. నూతన భారతదేశ (NewIndia)నిర్మాణము కోసం కృషిచేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు మన పార్టీ జాతీయ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గారి యొక్క కలను సారకరం చేయడానికి మనమందరం అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

నాయకత్వం యొక్క కొనసాగింపుకు ఇది చాలా ముఖ్యం. చాలా బలమైన రెండవ స్థాయి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం అనేది నా బాధ్యత. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాయకత్వం వహించడానికి, నాయకత్వ పాత్ర పోషించడానికి మన కార్యకర్తలు సిద్ధంగా వుండాలి. దీని కోసం నేను ఒక సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాను. నాయకుడు అధ్భుతమైన పరిజ్ఞానంతో మరియు సరైన మరియు ఫలవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి,ఈ విషయంలో లైబ్రరీలు (పుస్తకాలు) పెద్ద పాత్ర పోషిస్తాయి. సరైన పుస్తకాలు మనల్ని ప్రేరేపించడమే కాక, సరైన దిశలో నడిపిస్తాయి. అందువల్ల, అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు మరియు సిటీ పార్టీ కార్యాలయాల వద్ద లైబ్రరీలను తెరవాలని నేను నిర్ణయించుకున్నాను. మంచి జ్ఞానం ఇవ్వడమే కాక, మార్గదర్శకత్వం ఇచ్చే ఈ కేంద్రాలు నూతన నాయకత్వం యొక్క మొత్తం గుణాత్మక అభివృద్ధిలో ఒక అంతర్భాగంగా మారుతాయి.

ఈ లక్ష్యాన్ని అందరూ అవగాహన చేసుకుని, గుర్తించడానికి శాలువాలు, మెమెంటోలు, బొకేలు వంటి వివిధ బహుమతులను అంగీకరించే బదులు, నేను బిజెపి అభిమానుల నుండి వచ్చిన పుస్తకాలు అందుకోవటానికి చాలా సంతోషిస్తాను. ఈ పుస్తకాలు ప్రేరణాత్మకంగా ఉంటాయి; నాయకుడి లక్షణాల గురించి మరియు; సామాజిక-ఆర్ధిక అభివృద్ధి గురించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని గురించి తెలుసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం దయచేసి మా కార్యాలయాన్ని సంప్రదించండి

కన్నా లక్ష్మినారాయణ,
అధ్యక్షుడు, బిజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్.